English-speaking church in Eindhoven

స్వాగతం !

నెథర్లాండ్స్ దేశం, ఐంధోవెన్ నగరంలొ ఉన్న ట్రినిటి దేవాలయమునకు స్వాగతం! మా సంఘములో అనేక దేశముల నుండి వచ్చిన విభిన్న భాషలు మాట్లాడే క్రైస్తవులు ఏకముగా కూడి ఆంగ్లములో దేవుని స్తుతించి ఆరాధిస్తాము. ఇక్కడ తెలుగు వారితో పాటు తమిళ, కన్నడ, మళయాలము, హిందీ, బెంగాలీ భాషలు మాట్లాడే సంఘస్తులు ఉన్నారు.

దేవుని గూర్చిన జ్ఞానము పొందగోరువారు, ఆత్మలోను సత్యములోను దేవుని ఆరాధింప ఆపేక్ష కలిగినవారు, క్రైస్తవ సోదర ప్రేమాభిమానములు ఆస్వాదించగోరువారు అందరికీ ఇదే మా ఆహ్వానము.